విశ్వహిందూ పరిషత్ దుర్గా వాహిని
రామారెడ్డి జూలై 20( ప్రజా జ్యోతి)
శక్తి సాధన కేంద్రం సాప్తహిక్ మిలన్ కేంద్రంగా రామారెడ్డి ప్రకండలో ప్రతి ఆదివారం సాయంత్రం 4–6 గంటల వరకు రెండు గంటల సమయం, కనీసం 40 నుండి 45 దుర్గలతో ఈ యొక్క సాప్తహిక్ మిలన్ కేంద్రం నిర్వహించడం జరుగుతుంది.ఈ శక్తిసాధన కేంద్రంలో మహిళలు, అమ్మాయిల పైన సమాజంలో అనునిత్యం ఏదో ఒకచోట జరుగుతున్న దాడులను ఎదుర్కోవడం కోసం వారి యొక్క ఆత్మ రక్షణని కాపాడుకోవడం కోసం ఇలాంటి విద్యలు నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని దుర్గవాహిని జిల్లా సహా సంయోజిక మట్టే భవాని గారు అలాగే దుర్గ వాహిని శిక్ష వర్గ పూర్తి చేసుకున్నటువంటి అంజని, సాగరిక, స్పందన, శ్రీరంజని వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క శక్తిసాధన కేంద్రం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా నియుద్ధ(కరాటే), చురక, దండ(కర్ర) యుద్ద, తల్వార్(కత్తి), త్రిశూల్ లాంటి ఎన్నో విద్యలు ఈ యొక్క శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే హిందూ సాంప్రదాయాల పట్ల, సంస్కృతుల పట్ల అవగాహన కొరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విశ్వహిందూ పరిషత్ దుర్గ వాహిని ఆధ్వర్యంలో నేర్పించడం జరుగుతుంది.