ఎల్లారెడ్డిలో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు
ఎల్లారెడ్డి జూలై 20 (ప్రజా జ్యోతి)
ఎల్లారెడ్డి పట్టణంలోని ఆదివారం శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మకు బోనాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ సందర్భంగా పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మహిళలు నైవిద్యంతో పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజ భజంత్రీలతో ఊడరమ్మ ఆలయానికి ఘటానికి తీసుకెళ్లి ఘటం సమర్పించి ఆలయానికి చేరుకొని ఉడిబియ్యం పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం పట్టణంలోని వేద కాలనీల నుంచి ఉదారంగా బోనాలు తయారుచేసుకుని నూతన చీరలు ధరించి నెత్తిన బోనాలతో యువకులను నృత్యాలు శివశత్తుల విన్యాసాలతో ఊరేగింపుగా అమ్మవారికి ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. పిల్లాపాపలు పట్టణ ప్రజలు చల్లగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా తుడిచి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి వేడుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదులు పాల్గొన్నారు.