చేర్యాల జూలై20(ప్రజాజ్యోతి):చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ ఏరియాలో శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా కొండ్రాపల్లి గ్రామానికి చెందిన శేఖర్ కూలిపనుల నిమిత్తము చేర్యాలలో జీవనం కొనసాగిస్తున్నాడు. నివాసం ఉంటున్న ఇంటిలో శేఖర్ కూరగాయలు కోసే కత్తిపీటతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసంసిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.