ఏకశిల స్కూల్ లో బోనాల వేడుకలు

Warangal Bureau
0 Min Read

దామెర, జులై 19 (ప్రజాజ్యోతి):

దామెర మండలంలోని ఏకశిలా ప్రైమ్ పాఠశాలలో ముందస్తుగా బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి, ప్రిన్సిపాల్ గోకుల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ దీపా మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణలో బోనాల పండుగ ప్రత్యేకతను తెలుపుతూ బేతి కొండల్ రెడ్డి ప్రసంగించారు. చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అమ్మవారు మరియు పోతురాజు వేషధారలతో నాట్యాలను చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *