ఆత్మకూరు / దామెర , జులై 19 (ప్రజాజ్యోతి):
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్‌ఎస్ శ్రేణులకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం ఆత్మకూర్ మండలం అగ్రంపాడ్ గ్రామ శివారులోని జీఆర్ఎస్ గార్డెన్స్ లో ఆత్మకూరు, దామెర మండలాల ముఖ్యకార్యకర్తలతో నిర్వహించిన విష్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో రెండు మండలాల ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు,దామెర మండలాల మాజీ ప్రజాప్రతినిధులు,బిఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.