ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తుంది

Medak Staff Reporter

సిఎం రేవంత్ రెడ్డికి బేషన్సే కాదు బేసిక్స్ కూడా తెలియదని సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, బి ఆర్ ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్, కోల రమేష్ గౌడ్ అన్నారు..మండుటెండల్లో సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం మత్తల్లు దూకిపిస్తే…. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎడారిలా మారుస్తుందని ఆరోపించారు..జి ల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు.తెలంగాణ సమాజం పట్ల, నీటి వసతుల పట్ల కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అన్నారు.రైతు ప్రయోజనాలను ఫణంగా పెడితే బి ఆర్ ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని….. కల్లపల్లి పంప్ హౌస్ వద్ద నీటి ఎత్తిపోతలు ప్రారంభించి రైతులకు నీరు అందివ్వాలని డిమాండ్ చేశారు..గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతు మొగులుకు ముఖం పెట్టి చూడలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు..కనీసం రైతులకు సరిపడా యూరియా కూడా అందించడం లేదని…… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎరువుల ధరను పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపిలు ఒకరికి ఒకరు రక్షణ కవచంలా నిలుస్తున్నాయని అన్నారు. ఎప్పటికైనా రైతులకు రక్షణ కల్పించి రైతు సంక్షేమ పాలన కొనసాగించేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలకు దగ్గరగా వస్తున్న ఇప్పటివరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నియమించకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.కెసిఆర్, హరీష్ రావుల నేతృత్వంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. తెలంగాణ ప్రాంతంపై, ప్రజలపై ఆంధ్ర నాయకుల అవహేళనలు ఎక్కువయ్యాయని…. వీటిని మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.ఇప్పటికైనా ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం రైతులకు నీరు అందించాలని లేనిపక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకత్వంలో మోటర్లు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ కాపాడుకోవడం గురించి ఆలోచించడం మాని ప్రజా పాలనపై దృష్టి సారించాలని హితువు పలికారు..ఈ మీడియా సమావేశంలో నంగునూర్ మండల పార్టీ అధ్యక్షులు లింగం గౌడ్, కౌన్సిలర్ సుందర్, నాయకులు మొహీజ్, ఎల్లయ్య, బాబు, సతీష్, ఆకుబత్తిని, రాము, గోరేమియా పలువురు పాల్గొన్నారు…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *