సిద్దిపేట రజక సంఘం గౌరవ అధ్యక్షులుగా భూంపల్లి రాజలింగం, భూంపల్లి కనకరాజు ఎన్నికయ్యారు. ఆదివారం సిద్దిపేటలో రజక సంఘం పట్టణ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా భూంపల్లి లింగస్వామి, ఉపాధ్యక్షుడిగా చెవిటి శ్యామ్, కార్యదర్శి కోడూరి మల్లికార్జున్, సహాయక కార్యదర్శిగా నారాయణరావుపేట నరేష్,కోశాధికారి అంతగిరి పోచయ్య, డైరెక్టర్లు భూంపల్లి చందు, అల్లీపురం మల్లేశం, చిట్టపురం బిక్షపతి,బోనగిరి శ్రీనివాస్,భూంపల్లి శ్రీహరి, మీడియా అడ్వైజర్ చెవిటి సంతోష్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన ఎన్నికైన కార్యవర్గాన్ని నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు భూంపల్లి లింగస్వామి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ సంఘ అభివృద్ధి, సామాజిక సంక్షేమం దిశగా సంఘ సభ్యులతో కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. ఇప్పటికే ఆగిపోయిన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించి, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భూంపల్లి శ్రీనివాస్,చెవిటి రాజు,బోనగిరి కనకయ్య,కానిగంటి అంజయ్య,బోనగిరి నందం కోడూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.