మళ్లీ మన సిద్దిపేటకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళా ప్రతిష్ట పెరగాలంటే కేసీఆర్ రావాలి

Medak Staff Reporter

 

సిద్దిపేట ప్రజాజ్యోతి : సిద్దిపేట

క్యాంప్ కార్యాలయం లో శనివారం 167 లబ్ధిదారులకు 38 లక్షల 54 వేల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూవర్షాలు పడతలేవు పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉంది అన్నారు రేవంత్ రెడ్డి ఏమో మోటార్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తుండని విమర్శించారు.మహారాష్ట్రలో వర్షాలు పడుతుంటే ఇవాళ గోదావరి నదిలో ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి

రోజుకు 80 టీఎంసీల నీళ్లు పోతున్నాయి.మోటర్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుంది. అట్లా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు అన్నారు

కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఊరికే బధనం చేస్తున్నారు. అన్నారుమేడిగడ్డ బ్రిడ్జి పైన లారీలు మోటర్లు నడుస్తున్నాయి ఒకవేళ మేడిగడ్డ మొత్తానికే కూలితే మోటర్లు లారీలు ఎందుకు నడుస్తున్నాయి. అని ప్రశ్నించారు రంగనాయక సాగర్ కాలేశ్వరం కాదా ? మల్లన్న సాగర్ కాళేశ్వరం కాదా ? కొండపోచమ్మ సాగర్ కాలేశ్వరం కాదా ?ఇవేమీ చూడకుండా కాలేశ్వరం కూలిపోయిందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు అన్నారు.సత్తా ఉంటె, దమ్ముంటే పెట్టు అసెంబ్లీనువ్వేం చేసావో.. మేము ఎం చేసామో మాట్లాడుదాం. అన్నారు

అసెంబ్లీ పెట్టె దమ్ముందా నీకు రేవంత్ రెడ్డి.అన్ని అబద్దాలు మాట్లాడటం తప్ప ఎం తెలుసు అన్నారు- కృష్ణ నదిలోకి నీళ్లొచ్చి 36 రోజులైనా ఎందుకు కల్వకుర్తి మోటార్లు స్టార్ట్ చెయ్యలేదని నువ్వు మోటార్లు ఆన్ చేస్తావా మేము చేయాలా అని మేము ప్రశ్నిస్తే కల్వకుర్తికి మోటార్లు ఆన్ చేసారు. అని రైతులు ఏం చేశారు కాలేశ్వరం ఏం చేసింది. కాలేశ్వరం ఓపెన్ చేస్తే కేసీఆర్ కి పేరు వస్తుందని ఓర్వ లేక నీళ్లు ఆపుతుండు. అని విమర్శించారు

కుంగినై రెండు పిల్లర్లు ?

పేర్లు చేస్తే ఆరే ఆరు నెలల్లో అంతా. మంచిగా అయితది. అనికండ్ల ముందు నీరు పోతున్నాయి కానీ రైతులకు నీళ్లు ఇస్తలేడు. అన్నారు అన్ని బందు పెట్టిండు ఇప్పుడు మల్ల రైతుబంధు అంటుండు అన్నారు కెసిఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇస్తే.. రేవంత్ ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తుండు అని విమర్శించారు.కొంతమంది ఒక పంట వేయకపోతే వాళ్లకు రైతుబంధు ఇస్తలేడు. ఊర్ల పోతే చెబుతున్నారు. ట్రాక్టర్లు వస్తలేవు సార్, చెత్త బండ్లు వస్తలేవు సార్ అంటున్నారు.కెసిఆర్ ట్రాక్టర్లు కొనిచ్చిండు, రేవంత్ కు అందులో డీజిల్ కొట్టడానికి పైసలు లేవు

కెసిఆర్ ఉండంగా కెసిఆర్ కిట్ వస్తుంది ఇప్పుడు అది కూడా బంద్ అయింది మల్ల నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అన్నట్లు అయింది అన్నార ప్రజలన్నీ గమనిస్తున్నారు రేవంత్ కి మాటలెక్కున్నాయి చేతలు తక్కువ ఉన్నాయి అన్నారు మళ్లీ మన సిద్దిపేటకు పూర్వ వైభవం రావాలంటే మళ్ళా ప్రతిష్ట పెరగాలంటే కేసీఆర్ రావాలి.అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్స్,

తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *