సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఎటువంటి సమాచారం లేకుండా ఆర్ అండ్ బి అధికారులు మార్కింగ్ చేయడం ఏంటంటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మార్కింగ్ చేసినప్పుడు ఇదే తరహాలో ఉన్నత అధికారులను కలవడం వల్ల గ్రామంలో రింగ్ రోడ్డు ద్వారా రహదారిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులే మళ్లీ మా ఇల్లు కూలగొట్టడానికి చూసినట్లయితే మేము ఊరుకునేది లేదని, అన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రెహమాన్ ని కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించక పోయినట్లయితే రాబోయే రోజుల్లో ఉన్నత అధికారులను కలిసి మా సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని వారు తెలిపారు.