టాప్ 10 నగరాల్లో ఆసియా పసిఫిక్ దేశాలకు సంబంధించి టాప్ 5లో సింగపూర్ మినహా మిగిలిన నాలుగు నగరాలు భారతదేశానికి చెందిన నగరాలే. టాప్ 10లో భారత్ లోని నగరాలు కాకుండా తైపీ.. సిడ్నీ.. మెల్ బోర్న్ నగరాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినా టెక్ నిపుణుల లభ్యత భారతదేశంలోనే అధికంగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. నిపుణులకు అవకాశాలు.. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కార్మిక సూచీ.. అందుబాటులోకి వచ్చే నిపుణులు.. భిన్న రంగాలకు అవసరమైన నిపుణుల లభ్యత లాంటి అంశాల్లో అంతర్జాతీయంగా 200 మార్కెట్లను విశ్లేషించి.. ఈ రిపోర్టును తయారు చేసినట్లుగా సదరు సంస్థ చెబుతోంది.
ఆసియా పసిఫిక్ దేశాల్లోని టెక్ నిపుణుల్లో 69 శాతం మంది భారత నగరాల్లోనే ఉన్నట్లుగా పేర్కొన్న రిపోర్టు.. ప్రపంచ అగ్రగామి టాప్ 10టెక్ నిపుణుల కేంద్రాల్లో బెంగళూరు.. బీజింగ్.. టోక్యో నగరాలు నిలిచాయి. అత్యంత కీలక నైపుణ్యాలు.. ఐటీకి అవసరమైన మౌలిక వసతులు.. గ్రేడ్ ఏ కార్యాలయాల స్థలాలు.. తక్కువ నిర్వహణ.. నిపుణుల వ్యయాలు లాంటివి టెక్నాలజీ రంగంలో భారతదేశం ప్రపంచానికే ఆకర్షణీయ కేంద్రంగా మారుతున్నట్లు పేర్కొన్నారు. డేటా సైంటిస్టుల లభ్యతలో బెంగళూరు నగరం ముందుంది. పాతికేళ్ల లోపు సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉన్న విషయాన్ని రిపోర్టు వెల్లడించింది.