గురువులను గౌరవించడం అందరి బాధ్ను గౌరవించడం అందరి బాధ్యత అని బిజెపి మహిళమోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారెడ్డి అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి శిశుమందిర్ లో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించి పాఠశాలలో ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి ఉమారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురువును గౌరవించి, దేవుడిగా కొలిచే ఏకైక దేశం భారతదేశం అని,
ప్రపంచానికి అష్టాదశ పురాణాలను అందించిన మహర్షి, మానవ జీవన విలువలను మహోన్నతంగా గీత రూపంలో అందించి, వేదాల, ఉపనిషత్తుల సారాన్ని పురాణాలుగా అందించిన ఆది గురువు వ్యాస భగవానుల జన్మదినమైన ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు మన దేశంలో వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణిమగా జరుపుకొంటామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి, జ్ఞానంతో ప్రకాశింపజేసేటువంటి గురువును మన సంస్కృతిలో దైవస్వరూపంగా పరిగణించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరు తమ గురువులను గౌరవించాలని, వారి మార్గదర్శకంలో నడవాలని, గురువు మాట విని, గురువు ద్వారా విద్యను పొంది సన్మార్గంలో నడిచే విద్యార్థులు జీవితం లో బాగుపడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ ప్రధానాచార్యులు మోతుకు నరేష్ కుమార్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి రెడ్డి, ఉపాధ్యాయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.