మహబూబ్ నగర్ జూలై 9 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) జర్నలిస్టులకు అన్ని విధాలుగా సహకరిస్తామని మీ న్యాయ మైన డిమాండ్ ల తో పాటు బోనస్ డిమాండ్లను కూడా తీరుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో 17 రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షల విరమణ కోసం ప్రభుత్వం తరపున దీక్ష శిబిరానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గత పదిఏండ్లు గా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టుల మధ్య గొర్రెలు మధ్య పోటీ పెట్టినట్లుగా చిచ్చుపెట్టి చనిపోయిన వాటిని కోసుకుని తినే విదంగా కుటిల రాజకీయం చూపించి తన పబ్బం గడుపుకున్నాడని, ఒక్కో ఇంటికి 3 మూడు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఎన్నికల రోజు ఓట్ల కోసం వరుసలో నిలబడ్డ వారికి సైతం పట్టాలు పంపిణీ చేసిన నీచమైన చరిత్ర శ్రీనివాస్ గౌడ్ దని విరుచుకు పడ్డారు. పాలమూరు ప్రశాంతతకు పిచ్చి పెట్టి పేద ప్రజల మధ్య విభేదాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేసిన శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల్లో సౌమ్యుడు స్వార్థం లేని నిబద్ధత కలిగి నిబద్ధత కలిగిన నాయకుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డినీ గెలిపించడంలో మీ పాత్ర కీలకమని మిమ్మల్ని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు రానున్న రోజులు ఇదే పోరాటస్ఫూర్తితో దుర్మార్గ పాలనను అంతమోందిచిన గత చరిత్ర స్మృతులను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యపరుస్తు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టులో కడుపు కట్టుకొని ఎన్నికల్లో సహకరించి ఎన్ఎం గెలుపుకు కృషి చేశారన్నారు నిజాయితీ ని పద్ధతులతో పనిచేస్తూ ఈనాడు పిట్టగూడు లాంటి ఇండ్ల కోసం రోడ్డు ఎక్కడం చాలా బాధాకరమని వారి బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి వారి డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించమని చెప్పడం జరిగిందని అందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ సిరాజ్ కాద్రి , జర్నలిస్టు నాయకులు అశోక్ కుమార్, విజయకుమార్, సుందర్ చారి, రవీందర్, బాలరాజు, రఫీ, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.