కేటీఆర్‌ పెట్టిన చాలెంజ్‌ గడువు ఇవాళే

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. సై అంటే సై అంటూ ఎవరి పాలనలో ఏం జరిగింది చర్చకు సిద్ధమంటున్నాయి కాంగ్రెస్-బీఆర్ఎస్. డేట్, టైం, ప్లేస్ ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ.. అధికార-విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలపై, చేస్తోన్న అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అన్న రేవంత్ సవాల్‌ను స్వీకరించారు కేటీఆర్. నాకు దమ్ముంది.. చర్చించే ధైర్యం ఉంది. ప్లేస్‌ మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే అంటూ ప్రతిసవాల్ విసిరారు కేటీఆర్. ఈనెల 8న ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలంటూ డెడ్‌ లైన్‌ పెట్టారు. మరోవైపు కేటీఆర్ ప్రతిసవాల్‌పై స్పందించారు మంత్రులు. ప్లేస్‌ ప్రెస్‌క్లబ్‌ కాదు అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలన్నారు. రైతు కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది.. ఏడాదిలో రైతుల కోసం తామేం చేసింది చర్చించేందుకు సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో లక్ష కోట్లకు పైగా రైతులకు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతురాజ్యం తీసుకొచ్చిందని.. దీనిపై అసెంబ్లీలో అయినా.. పార్లమెంట్‌లో అయినా చర్చకు సిద్ధమన్నారు. మోదీ వస్తారో, కేసీఆర్, కిషన్ రెడ్డి, కేటీఆర్ వస్తారో ఎవరొస్తారో రండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్.

సీఎం రేవంత్‌ సవాల్‌కు.. బీఆర్ఎస్ నుంచి కూడా అంతే రీతిలో కౌంటర్ వచ్చింది. రైతు కోసం ఎవరు ఏం చేశారో, పాలు ఏంటో.. తేల్చేద్దామంటూ డెడ్ లైన్ విధించారు కేటీఆర్. డేట్, టైమ్, ప్లేస్ మీరు చెప్పినా ఓకే.. మమ్మల్ని చెప్పమన్నా ఓకే అన్నారు కేటీఆర్. సీఎం ఇప్పటికే ఎన్నో అంశాల మీద సవాల్ చేసి పారిపోయారని, రైతులపై చర్చకు కూడా పారిపోయే అవకాశం ఉందన్నారు. అందుకే 8వ తేదీ 11గంటలకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో ప్రెస్‌క్లబ్‌కు వస్తామన్నారు కేటీఆర్. సీఎం సింగిల్‌గా వచ్చినా ఓకే, గుంపుగా కేటీఆర్‌ పెట్టిన గడువు 8వ తేదీ రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది. కేటీఆర్‌ ఆండ్‌ టీమ్‌ ప్రెస్‌క్లబ్‌కు వస్తుందా? వస్తే ఎవరెవరు వస్తారు? కాంగ్రెస్‌ ఎలాంటి ఇవ్వబోతుంది అనేది ఆసక్తిగా మారింది.వచ్చినా ఓకే అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *