పేలుడు పదార్థాల కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదు

Kamareddy
2 Min Read

పేలుడు పదార్థాల కేసులో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదు

* మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి 

* అర్ధరాత్రి 12 గంటలకు అరెస్టు చేసి జైలుకు తరలించారు

* మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపిసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారు

* శ్రీవారి వెంచర్ ను విబుస్ వెంచర్స్ వారికి అప్పజెప్పాము

* మా భర్త పేరిట ఒక్క గుంట భూమి లేదు

* రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే అక్రమ కేసులు

* మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి జులై 6 (ప్రజా జ్యోతి)

నా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పై అక్రమంగా అనవసరంగా అబండాలు మోపి కేసులు చేసి అరెస్టు చేయడం వెనక రాజకీయ కుట్ర ఉందా..? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అయ్యుండి కూడా ఇలాంటి ఘటనకు పాల్పడతారని ఎలా నమ్ముతున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేశారని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని లో పత్రిక సమావేశం లో మాట్లాడారు. రాజకీయ కక్ష కారణంగా తమపై ఆరోపణలు చేస్తు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ పటిష్టకు కృషి చేస్తామన్నారు. పేలుడు పదార్థాల నిల్వ కేసులో తన భర్త చంద్రశేఖర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపిసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. శ్రీవారి వెంచర్ ను విబుస్ వెంచర్స్ వారికి అప్పజెప్పామన్నారు. మా భర్త కు ఆ వెంచర్ తో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, ఒక్క గుంట భూమి తన భర్త పేరు మీద లేదన్నారు. మా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టారని, ప్రజలే త్వరలో నిర్ణయిస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కోసం తీవ్రంగా కృషి చేశామని తెలిపారు. తమ కృషి ని గుర్తించి చంద్రశేఖర్ రెడ్డికి టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్ట బెట్టరన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం లక్ష్యంగా పనీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కు కృషి చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తమ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ వైస్ చైర్మన్ ఊరుదొండ వనిత రవి పాత, కౌన్సిలర్లు శివకృష్ణ మూర్తి, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, వంశీ, పిడుగు మమతా సాయిబాబా, సుగుణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *