పదోన్నతులు పోలీసులకు బాధ్యతను పెంచుతాయి

Kamareddy
1 Min Read

పదోన్నతులు పోలీసులకు బాధ్యతను పెంచుతాయి

* పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి

* నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి.

* జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐపిఎస్

కామారెడ్డి ప్రతినిధి జూలై 5 (ప్రజా జ్యోతి)

పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన (13) పోలీసులను అభినందించి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించిన జిల్లా ఎస్పీ.కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వారి వివరాలు 1.ఏ.రామేశ్వర్ రెడ్డి,- లింగంపేట్, 2. మధుకర్- ఎల్లారెడ్డి, 3. ఏ. దేవేందర్ – లింగంపేట్, 4.బిఎం. రాజు – దేవునిపల్లి,5. సిహెచ్. సాయిలు – బిచ్కుంద,6. జి. రాజు కుమార్ -బిచ్కుంద,7. ప్రిన్స్ బాబు,8. పి. అనిల్ కుమార్- రాజంపేట,9. రామారావు – మాచారెడ్డి,10. సిహెచ్ స్వామి – మాచారెడ్డి,11. సిహెచ్ శ్రీనివాస్- నాగిరెడ్డి పేట్ ,12. సిహెచ్ మహేందర్,13. సంజీవులు దేవునిపల్లి హెడ్ కానిస్టేబుల్ గా, పదోన్నతి పొందిన పోలీసులు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పోలీసులకు ఎస్పీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..!

పోలీస్ శాఖలో పదోన్నతులు బాధ్యతను పెంచడంతోపాటు, సేవా ఉత్సాహాన్ని మరింత గాఢం చేస్తాయని తెలిపారు. ప్రజల సేవలో నిజాయితీగా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్ లభిస్తుందని, అలాగే బదిలీ ప్రక్రియలో విల్లింగ్ స్టేషన్‌లు, సీనియారిటీ, దంపతుల సేవలు, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని బదిలీలు జరుపుతున్నట్లు తెలిపారు.పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్‌లు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *