శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది డి వై ఎస్ ఓ వెంకట నర్సయ్య
సిద్దిపేట ప్రజాజ్యోతి :శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని సిద్దిపేట జిల్లా డి వై ఎస్ ఓ వెంకట నర్సయ్య, సిద్దిపేట స్పోర్ట్స్ కన్వినర్ పాల సాయిరాం అన్నారు. సిద్దిపేట జిల్లా జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టీం సెలక్షన్ కార్యక్రమన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మాజీ మంత్రి, హరిశ్ రావు చొరవతో సిద్దిపేట జిల్లా కేంద్రం స్పోర్ట్స్ హబ్ గా మారిందన్నారు. అద్భుతమైన క్రీడామిధనలను ఏర్పాటు చేశారని వాటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్ద పెద్ద క్రీడాకారులను మనం సన్మానం చేయడం కాదు ఇక్కడి నుండే పెద్ద క్రీడాకారులుగా ఎదుగాలని సూచించారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షంచారు. క్రీడాకారిణికి ఘన సన్మానం…. తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయి ప్రాబబుల్స్ కి ఎంపిక అయినా సిద్దిపేట ఫుట్బాల్ క్లబ్ ఫుట్బాల్ ప్లేయర్ చైతన్య శ్రీ ని డి వై ఎస్ ఓ వెంకట నర్సయ్య, స్పోర్ట్స్ కన్వీనర్ పాల సాయిరాం, సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ తరుపున ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ చైతన్య శ్రీ ఇండియన్ ఫుట్బాల్ టీం జెర్సీ ధరించాలని ఆకాంక్షించారు. సిద్దిపేట ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్ మాట్లాడుతూ సిద్దిపేట నుండి జాతీయ స్థాయికి ఎదిగిన చైతన్య శ్రీ కి అభినందనలు తెలిపారు. చిన్నప్పటినుండి ఫుట్బాల్ అంటే అమితమైన ప్రేమను చూపించిందని అన్నారు. కష్టపడి ఇష్టంగా సాధించిందని అన్నారు. తనకు ఫుట్బాల్ నేర్పిన కోచ్ గా గర్వపడుతున్నని తెలిపారు. టీం ఇండియా తరుపున కూడా తాను అదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా రు. సిద్దిపేట జిల్లా జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టీం ఎంపిక పూర్తి…. సిద్దిపేట జిల్లా జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టీం ఎంపిక పూర్తయ్యిందని సిద్దిపేట సెలక్షన్ కమిటీ సభ్యులు అక్బర్ నవాబ్, నర్సింములు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ఫుట్బాల్ గ్రాస్ గ్రౌండ్ లొ నిర్వహించిన సెలక్షన్స్ లొ జిల్లా వ్యాప్తంగా 35 మంది ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఫుట్బాల్ ప్లేయర్స్ లొ స్టామినా, బాల్ టచ్,రన్నింగ్, షూటింగ్, పాసింగ్ కో ఆర్డినేషన్ లాంటి విభాగల్లో వారి సమర్ధతను పరిశీలించి 20 మంది క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఈ నెల 8 నుండి ఆదిలాబాద్ లొ జరిగే రాష్ట్ర స్థాయి టీం ఎంపికలో వీరు పాల్గొనరని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రటరీ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.