గరిడేపల్లి,జూలై 01(ప్రజా జ్యోతి):గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఆశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు 19 వేల విలువగల క్రీడా సామాగ్రి మరియు దుస్తులు నోట్ బుక్స్ పెన్స్ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఫౌండేషన్ నిర్వాహకులు కందుల పూర్ణి రామ్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను అందజేయడం చాలా సంతోషంగా ఉందని,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ సంస్థ తరఫున నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.