![]()
మహబూబ్ నగర్ జూన్ 25 ( ప్రజా జ్యోతి జిల్లా ప్రతినిధి ) తమ న్యాయం పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా మహబూబ్ నగర్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ స్పష్టం చేశారు. రెండు రోజులు దీక్షలు చేసి, మూడో రోజు జరిగిన దీక్ష శిబిరానికి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తరపున టిపిసిసి ప్రతినిధి వినోద్ కుమార్, మూడ ఛైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి తదితరులు జర్నలిస్ట్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యేతో మాట్లాడి కృషి చేస్తామని తెలిపారు. అయితే సమస్యలు పరిష్కారం కోసం స్పష్టమైన హామీ అధికారుల నుండి వచ్చిన తర్వాతే దీక్ష విరమిస్తామని పట్టు పట్టడంతో విధిలేక కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ని బుధ వారం సాయంత్రం ఫెడరేషన్ నాయకులు చర్చలు జరిపారు. ఇందుకు కాంగ్రెస్ నాయకులు మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా పరిష్కరించి స్పందించకపోగా ప్రత్యేక విచారణ చేస్తామని చెప్పడం వెనుక సమస్యలు పరిష్కారం కావనే ఉద్దేశంతో తమ దీక్షలను యధావిధిగా కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీరన్న పేట, దివిటిపల్లి , ఎస్వీఎస్ గుట్ట మీద ఇచ్చిన ఇండ్లు ఇండ్ల పట్టాలు విచారణ చేస్తున్నామని దారిద్ర రేఖ దిగువన రాని వారివి, పరిమితి మించి నిర్మించిన ఇండ్లను తొలగిస్తామన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్ట్ లతో పాటు ప్రజలకు ఇచ్చిన పట్టాలు అన్ని విచారణ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎక్కడ ఇండ్లు, ఇండ్ల స్థలాలు రాని జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యమానికి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు . జిల్లా కలెక్టర్ తో చర్చలు జరిపిన వారిలో టిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బండి విజయకుమార్,జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, కటిక రవీందర్, జిల్లా కార్యదర్శి గోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉమామహేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పసుపుల, శ్రీనివాస్, సామ్యాల్ సుందర్ చారి, ఎంవి రమణ, ప్రజాపక్షం స్టాఫ్ రిపోర్టర్ ఐల మౌని శేఖర్ , రవీందర్ గౌడ్, సుదర్శన్, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ తో చర్చలు విఫలం జర్నలిస్టుల రిలే దీక్షలు కొనసాగింపు – జిల్లా కలెక్టర్ తో చర్చలు విఫలం – చేతులెత్తేసిన అధికార కాంగ్రెస్ మధ్యవర్తులు
Leave a Comment