మున్సిపల్ అభివృద్ధికి రూ. 300 కోట్లు
అభివృద్ధిపై సీఎం ఫోకస్
కొడంగల్ జూన్ 21 ప్రజా జ్యోతి న్యూస్ :
కోడంగల్ మున్సిపల్ అభివృద్ధికి రూ. 300 కోట్లతో అభివృద్ధి పనులకు నేడు (శనివారం) మధ్యాహ్నం 1 గంటలకు శ్రీకారం చుట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందరం ప్రశాంత్ లు తెలిపారు, కోడంగల్ లోని వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడంగల్ మున్సిపల్ లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిపారన్నారు, కోడంగల్ మున్సిపల్ అభివృద్ధి కోసం ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారని, 2,50,29,66 కోట్ల రూపాయలతో మెరుగైన నీటి సరఫరా, 66,71,33,822 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ,57,67,41,344 కోట్ల రూపాయలతో వర్షపు నీటిపారుదల వ్యవస్థ,7,08,71838 కోట్ల రూపాయలతో ఘన వ్యర్ధాల నిర్వహణ,78,28,23,073 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు, కూడలి అభివృద్ధి, స్వాగత వంపు, ఇంటర్నల్ రోడ్డు, కూడలి అభివృద్ధి, వీధి లైట్ల వంటి వాటికోసం 300 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు, మున్సిపల్ లోని వినాయక చౌరస్తాలు మధ్యాహ్నం ఒకటి గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.