18 నెలల్లో రైతాంగం సంక్షేమం పై లక్ష కోట్ల రూ.లు ఖర్చు : సి.ఎం.ఏ.రేవంత్ రెడ్డి

4 Min Read

 రైతు నేస్తం కార్యక్రమం జిల్లాల్లో 48 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం

 

▪️మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్నా పూర్ గ్రామం లో హాజరైన శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

 

▪️రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా నిర్వహించిన “రైతు నేస్తం” కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి

రైతులతో ముఖాముఖి

▪️రైతు భరోసా నిధులు విడుదల

▪️9 రోజుల్లో 9 వేల కోట్ల రూ.లు రైతు భరోసా కింద రైతుల అకౌంట్లల్లో జమ

 

మహబూబ్ నగర్ జూన్ 16 ( ప్రజా జ్యోతి ప్రతినిధి ) రైతు భరోసా కింద 9 రోజుల్లో రాష్ట్రంలోని రైతాంగం అందరికీ 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ .రేవంత్ రెడ్డి తెలిపారు.

సోమవారం ఆయన రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండిరాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా నిర్వహించిన “రైతు నేస్తం” కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులను రాజుగా చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేయడంలో భాగంగా రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు.గతంలో మాదిరిగానే రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి వాణిజ్య పంటలు పంటలు పండించే విధంగా ప్రోత్సహించాలని, ముఖ్యంగా సోలార్ ద్వారా పంపుసెట్లు

నిర్వహించుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను వేదిక నుండి ఆదేశించారు.రైతు వేదికలలో అనుభవజ్ఞుల ద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించే విధంగా, నూతన సాంకేతికత పై రైతులకుఅవగాహన కల్పించాలని, అవసరమైతే నిష్ణాతుల ద్వారా రైతు వేదికల ద్వారా తెలియజేసేందుకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని, సోలార్ పంప్ సెట్ల ప్రయోజనం, భూసారం ఆధారంగా ఏ పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియజేయాలని, ముఖ్యంగా ఉద్యాన, పండ్లతోటల పండించే విధంగా ప్రోత్సహించాలని, పంట మార్పిడి చేయాలని ,రైతుల ఆలోచనలో చైతన్యం తీసుకొచ్చే విధంగా చూడాలని చెప్పారు.

గత ప్రభుత్వం రైతు రుణమాఫీ

చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో కేవలం 16 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేస్తే ,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎవరూ చేయని విధంగా కేవలం 4 నెలల్లో 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని తెలిపారు . సన్న వడ్లు పండించిన రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడమే కాకుండా, 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని,ఈ సంవత్సరం రెండు కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు .

 

గత ప్రభుత్వం గ్రామపంచాయతీ బిల్లుల పెండింగ్ల్లో ఉంచిందని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేయలేదని,

8 లక్షల 29 వేల కోట్ల రూపాయలు అప్పులను మిగిల్చి తమకు అప్పగించగా, ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నామని ,విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తోపాటు ,ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తున్నా మని,

అలాగే అప్పులు చెల్లిస్తున్నామని 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని ,వ్యవసాయం పై లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేశామని,

సివిల్ సర్వీస్ చదువులు చదివే వారికి రాజీవ్ గాంధీ స్కాలర్షిప్ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.

 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర రవాణా,బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు లు మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి1600 రైతు వేదికలలో

వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ప్రారంభించారు. కాగా రైతు నేస్తం కార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో పలువురు మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్సీలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ జానయ్య వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా,

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి,

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాస్,మండల వ్యవసాయ అధికారిణి శృతి,ఎం.పి.డి. ఓ ,ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.అనంతరం

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,

శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి లు ధర్నా పూర్ గ్రామానికి చెందిన మరణించిన ముగ్గురు రైతుల కుటుంబాల నామినీ లు పావని,శ్రీలత, రాఘవేందర్ లకు రైతు భీమా కింద ఒక్కొక్కరికి 5 లక్షల రూ ల చొప్పున చెక్కులు అంద చేశారు తొలుత

  1.  రైతు వేదిక వి.సి.యూనిట్ ప్రారంభించారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *