జిలుగు పెద్ద జన్మూ త్వరగా సాపర చేయండి
* సబ్సిడీపై విత్తనాలను సహకార చేయాలి
* పడిగెల రాజేశ్వరరావు
రామారెడ్డి మే 23 (ప్రజాజ్యోతి)
జిలుగు పెద్ద జన్మ విత్తనాలను సాపర చేయండి. సకాలంలో సరఫరా చేయండి. ముందస్తుగా వర్షాలు సకాలంలో కురుస్తున్నందున వెంటనే సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన జిలుగు పెద్ద జన్మ విత్తనాలను సరఫరా చేయాలని ఉమ్మడి సదాశివ నగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాల ద్వారా జిలుగు పెద్ద జన్మ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారని అన్నారు. కానీ అదే కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఏ సహకార సంఘానికి కూడా జిలుగు పెద్ద విత్తనాలు సరఫరా చేయలేదని పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిలుగు పెద్ద జనం విత్తనాల రేటు పెంచి రైతుల నడ్డి విరుస్తుందన్నారు. గతంలో జిలుగు బస్తాకు 1116/- రూపాయలు ఉండగా ఇప్పుడు ఇరవై ఒక్క 21 37/- రూపాయలు అలాగే పెద్ద జన్మ బస్తాకు గతంలో 1448/- ఉండగా ఇప్పుడు 2510/- పెంచారన రైతుల పక్షాన డిమాండ్ చేశారు. పెంచిన రేట్లు వెంటనే దించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు ఇప్పటికైనా రైతులకు అవసరమైన జిలుగు పెజ్జనము విత్తనాలను సరఫరా చేయాలన్నారు. అలాగే సన్న వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వెంటనే రైతులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు సేంద్రీయ వ్యవసాయం చేయాలని భారీ ప్రకటనలు ఇచ్చినప్పటికిని కామారెడ్డి జిల్లాలో వరినట్లకు అవసరమైన జిలుగు పెద్దజను విత్తనాలను సరఫరా చేయకపోవడం పట్ల రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందోఅర్థమైతుందన్నారు.
ఇప్పటికైనా ఈ విత్తనాలు సరఫరా చేయాలని లేని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ నాయకుడు కలాలి సాయ గౌడ్, మాజీ యూత్ అధ్యక్షుడు శివకుమార్, బిఆర్ఎస్ నాయకులు సోనరావు, శ్రీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.