జర్నలిస్టుల జాతరను జయప్రదం చేద్దాం….

Nalgonda Bureau
2 Min Read

జర్నలిస్టుల జాతరను జయప్రదం చేద్దాం

హైదరాబాద్ జలవిహార్ రజతోత్సవ సభకు తరలిరావాలి

టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్

నల్గొండ మే 20(ప్రజాజ్యోతి ప్రతినిధి): తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభ కు జర్నలిస్టు సమాజం స్వచ్ఛందం గా తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజె నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ కోరారు. టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈనెల 31 వ తేదీన 25 సంవత్సరాల సంద ర్బంగా హైదరాబాద్ లో నిర్వహిం చే రజతోత్సవ సభకు జిల్లా నుండి జర్నలిస్ట్ సోదరులు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ లో టీజేఎఫ్ రజతోత్సవాల సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2001 మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా టీజెఎఫ్ విర్భవించి0ద న్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిల బడి రాష్ట్ర సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు. టీజెఎ ఫ్ఏర్పడి 25 సంవత్సరాలు, పూర్తి అవుతున్న సందర్బంగా హైదరా బాద్ లోని జలవిహార్ లో “జర్నలిస్ట్ ల జాతర” ను నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు అన్నీ రాజకీయ పార్టీ ల ముఖ్యలు హాజరవుతారన్నారు. హైదరాబాదులోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రవితోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ జాతరకు జిల్లా లోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టు సోదరులు కావాలని అన్నారు. టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషరాజుపల్లి వీరస్వామి, యూనియన్ జిల్లాప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి సల్వాది జానయ్య, కార్యవర్గం సభ్యుడు కంబంపాటి సతీష్, నాయకులు కంది వేణు, శ్రీనివాస్, దండంపల్లి రవి కుమార్, ఉబ్బని సైదులు, ఓడపల్లి మధు, ముచ్చర్ల శ్రీనివాస్, పెద్దగోని మధు, మహేశ్వరపు రాంప్రసాద్, రె మిడాల మధు, పాలకూరి శేఖర్, జాజాల కృష్ణ, భాస్కర, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *