15వ తేదీలోపే లోకల్ నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 15వ తేదీలోపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీ శ్రేణులంతా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని.. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.