పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సునీల్ రెడ్డి జర్నీ.... సెల్ఫితో ప్రచారం... త్వరలో కాంగ్రెస్ లో చేరిక...

Submitted by SANJEEVAIAH on Thu, 13/07/2023 - 12:35
ఫోటో

పీసీసీతో సునీల్ రెడ్డి జర్నీ

త్వరలో కాంగ్రెస్ లో చేరిక

నిజామాబాద్ ప్రతినిధి, ప్రజాజ్యోతి, జూలై 13 :

బాల్కొండ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ రెడ్డి ఖరారు అయినట్లు తెలుస్తుంది. 
ఇటీవల విదేశీ పర్యటన తరువాత వచ్చిన రేవంత్ రెడ్డితో బిజినెస్ ఫ్లైట్ లో వెళ్ళిన ముత్యాల సునీల్ రెడ్డి రేవంత్ రెడ్డితో సెల్ఫీ దిగి మరి ప్రచారం చేసుకోవడం కోస మెరుపు.  ఇది ఇలా ఉంటే బాల్కొండ టికెట్ సునీల్ రెడ్డికే పక్క అని ఆయన అనుచరులు ముందస్తుగానే సంబరాలకు సిద్ధం అవుతున్నారు. నిన్నటి వరకు బిజెపిలో టికెట్ వస్తుందని ఆశించిన సునీల్ రెడ్డికి ఎంపి అరవింద్ నుంచి చుక్కెదురు తప్పలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కమలంపై ఆశలు గల్లంతు కావడంతో "చేయి" కలిపేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కోటరిలో చేరి చట్టపట్టాల్ వేస్తున్నట్లు సమాచారం.  ఈ వారంలో రోజుల్లో ఢిల్లీలో లేదా ఈ నెల 20 న మహబూబ్ నగర్ లో జరిగే ప్రియాంక గాంధీ సభలో పార్టీ కండువా జపౌకొనున్నట్లు తెలుస్తుంది.