పార్ట్ టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి : తెయులో ఉద్యోగుల నిరసన.

Submitted by SANJEEVAIAH on Thu, 22/06/2023 - 08:33
Photo

పార్ట్  టైం లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెయులో నిరసన

డిచ్ పల్లి,  ప్రజాజ్యోతి : 

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చర్లకు ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పార్ట్ టైం లెక్చర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ డి ప్రసన్న మాట్లాడుతూ పార్ట్ టైం లెక్చర్లను కూడా రెగ్యులరైజ్ చేయాలి లేదా ఉద్యోగ భద్రతను కల్పించాలి సంవత్సరంలో కేవలం కొద్ది రోజులు మాత్రమే వర్క్ లోడ్ లభిస్తుంది తద్వారా పార్ట్ టైం ఫ్యాకల్టీ చాలా నష్టపోతున్నారని, అల్మనక్ ప్రకారం వేతనాలు చెల్లించాలని పార్ట్ టైం అధ్యాపకులలో పి.హెచ్. సెట్ నెట్. ఉన్న వాళ్ళు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం జూనియర్, డిగ్రీ లెక్చరర్ల వలె తమని కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆ సంఘం అధ్యక్షులు డాక్టర్ దత్తా హరి మాట్లాడుతూ పార్ట్ టైం అధ్యపకుల న్యాయమైన డిమాండ్లకు తాము కూడా అండగా నిలుస్తామని రెండు అసోసియేషన్లది ఒకటి డిమాండ్ అని మనమంతా కలసి పోరాడుదాం అని అన్నారు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలుకుతూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సయ్యద్ తాహేర్, ఇ. శ్రీనివాస్ గౌడ్, రిగెల హరిత, రఘువీర్, గంగాధర్, కనకయ్య, చౌహన్ ఆఫ్రిన్, లింగమూర్తి, శీను నాయక్, శ్రీకాంత్ గౌడ్, నరేందర్, నవీన, గణేష్ నాయక్ కిషన్, విజయ్, సునీల్, విద్యార్థి నాయకులు సంతోష్ శివ నవీన్ సాయి పవన్లు పాల్గొన్నారు.