రిజిస్ట్రషన్ డిఐజిగా రమేష్ రెడ్డి... డి అర్ గా ప్రసూన... ఆ శాఖలో బదిలీలు...

Submitted by SANJEEVAIAH on Wed, 23/08/2023 - 00:41
Photo

డిఐజి గా రమేష్ రెడ్డి... డిఅర్ గా ప్రసూన

రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు

నిజామాబాద్, ప్రజాజ్యోతి, ఆగస్టు 22 :

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నిజామాబాద్ రేంజ్ డిఐజి జి.మధుసూధన్ రెడ్డి స్థానంలో రాష్ట్ర కార్యాలయంలో వేయింటింగ్ లో ఉన్న కే.వి.రమేష్ రెడ్డి బదిలీపై వచ్చారు. జి.మధుసూధన్ రెడ్డిని కరీంనగర్ డిఐజిగా బదిలీ చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ గా బదిలీ పై వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి జిల్లా రిజిస్ట్రార్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. అలాగే వరంగల్ డిఐజి కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న రామచంద్రయ్యను నిజామాబాద్ ఎస్.అర్.-1 కి సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు డిఐజిలు, పది మంది జిల్లా రిజిస్ట్రార్ లు, 73 సబ్ రిజిస్ట్రార్ లకు స్థానచలనం కలిగింది. ఇదిలా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో మూడు చోట్ల ఇంచార్జీ సబ్ రిజిస్ట్రార్ లుగా సీనియర్ అసిస్టెంట్లు పని చేయడం విశేషం.