ఐ డి జే ఎన్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఎడ్ల సంజీవ్ నియామకం

Submitted by SANJEEVAIAH on Mon, 26/06/2023 - 18:03
ఫోటో

ఐడిజెఎన్ రాష్ట్ర కో - కన్వీనర్ గా ఎడ్ల సంజీవ్

International Dalit Journalist Network (IDJN) తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ గా ఎడ్ల సంజీవ్ ఎంపిక అయ్యారు. 25న ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విపంచీ కళా నిలయంలో IDJN రాష్ట్ర మహాసభ జరిగింది. IDJN చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో జరిగిన మహాసభలకు ముఖ్య అతిథిగా మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, అందోల్ల్ ఎమ్మేల్యే క్రాంతికిరణ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పాల్గొని ప్రసంగించారు. మహాసభ అనంతరం IDJN రాష్ట్ర కమిటీని ఎంపిక చేశారు. రాష్ట్ర కన్వీనర్ గా జనార్ధన్ (ఆంధ్రజ్యోతి సిద్దిపేట), కో కన్వీనర్ గా ఎడ్ల సంజీవ్ (ప్రజాజ్యోతి, నిజామాబాద్)  సలహాదారులుగా నలుగురు, 11 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. 

పదహారు దేశాలతో పాటు ఇండియాలో 22 రాష్ట్రాలలో idjn కీలకంగా పని చేస్తుంది. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉంటూ ముఖ్యంగా దళిత సమస్యల పరిష్కారం కోసం అంబేడ్కర్ మార్గంలో పని చేస్తుంది. రాష్ట్రంతో పాటు దేశంలో పలు దళిత సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తుందని idjn చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు...