బీజేపీ కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

Submitted by BikshaReddy on Mon, 14/08/2023 - 12:47
బీజేపీ కాంగ్రెస్  నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

-ఎల్లారెడ్డి లో కేటీఆర్ రాకతో  

నాగిరెడ్డిపేట ఆగష్టు 14(ప్రజా జ్యోతి )

రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ సోమవారం ఎల్లారెడ్డి  పర్యటన నేపథ్యంలో మండలంలోని  పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు.యెల్లారెడ్డి లో కేటీఆర్ బహిరంగా సభ ఉన్నందున   ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అరెస్టులు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.మండల నాయకులు మాట్లాడుతూ ప్రజలు అడ్డుకుంటారనేమో నిలదీస్తారని భయంతో ముందస్తుగా అరెస్ట్ చెయ్యించడం ప్రభుత్వానికి  సిగ్గు చేటు అని  అన్నారు.