ఆశల పల్లకిలో... జంప్ జిలానీలు... : పార్టీ ఏదైనా టికెట్ ఇస్తే సరి... : చక్రం తిప్పుతున్న కీలక నేతలు... ఆశ పెడుతున్న పార్టీ అధినేతలు...

Submitted by SANJEEVAIAH on Sun, 17/09/2023 - 09:43
Photo

ఆశల పల్లకిలో... జంప్ జిలానీలు...

ఆశ చూపిస్తున్న పార్టీ అధినేతలు

పార్టీ ఏదైనా టికెట్ ఇస్తే సరి

చక్రం తిప్పుతున్న నేతలు

(నిజామాబాద్ ప్రతినిధి - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్)

రాజియాలలో శాశ్వత శత్రువులు ఉండరు... శాశ్వత మిత్రులు ఉండరు... అనేది అక్షర సత్యం. అందుకు ఇప్పుడు రాజకీయ పదవుల కోసం టికెట్ ఇచ్చే పార్టీల కోసం జంప్ జిలానీలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎవరివారే పార్టీ కండువాలు మార్చి పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే కొంత మంది పార్టీ కండువాలు మార్చి టికెట్ల వేటలో ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు వినిపిస్తున్న పేర్లు ముత్యాల సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి,   అరికెల నర్సారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఆకుల లలిత, వడ్డీ మోహన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ జెండా ఎత్తెందుకు రెడీ అవుతున్నారు. వీరి బాటలోనే కొత్త వారు కూడా పార్టీలలో చేరి తమ సత్తా చాటుకోవాలని పనిలో పడ్డారు.

పార్టీలు మారి మరి...

దీనికి తోడు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు గెలుపు గుర్రాల కోసం తలుపులు తెరిచి ఉంచారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో బలంగా త్రిముఖ పోరు ఖాయం అయింది. బిఅర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలు బలమైన అభ్యర్థుల వేటలో ఉండగా అభ్యర్థులు సైతం పార్టీ నిర్ణయాలు, నేతల పని తీరు చూసి అడుగులు వేస్తున్నారు. ఓటర్ల స్థితిపై గ్రౌండ్ లో పని చేస్తూ టికెట్ రాని యడల బీస్పి, ఎంఐఎంలతో పాటు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి టికెట్ పొంది పోటీ చేసి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు బిఅర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో ఎక్కువ మంది జంప్ జిలానీలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పార్టీలలో టికెట్ల ఆశిస్తున్న వారు అక్కడ టికెట్ రాకపోతే మరో పార్టీ గోడ దుకెందుకు సిద్ధంగా ఉన్నారు. అందు కోసం ఆయా పార్టీల నేతలు సైతం వెల్ కమ్ అంటు బోర్డు పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే బిఅర్ఎస్ టికెట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇలా కాంగ్రెస్ ఆర్మూర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, బాల్కొండలో కొత్త అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఆయా నియోజక వర్గాలలో భారీగానే దరఖాస్తులు వచ్చాయి. బిఎస్పీలో ఉన్న సునీల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పేసికున్నారు. ఆర్మూర్ లో బిజేపిలోని వినయ రెడ్డి చేయి కలిపారు. నిజామాబాద్ రూరల్ లో బిఆర్ఎస్ లో ఉన్న అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. నిజామాబాద్ అర్బన్ లో బి ఆర్ ఎస్ లో ఉన్న సంజయ్ కాంగ్రెస్ లో చేరి జోరు పెంచారు. దాదాపు టికెట్ ఖరారు అయిందనే ప్రచారం కూడా ఊపు అందుకుంది. కొత్తగా ఆర్మూర్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డి సోదరి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అర్బన్ లో నుడ మాజీ డైరెక్టర్ సంద శివప్రసాద్ పార్టీలో చేరారు. బిజెపి నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో వేటలో ఉండగా, ఎంఐఎం నిజామాబాద్ అర్బన్, బోధన్ లో వేటలో ఉన్నాయి. బిఆర్ఎస్ లో ఆకుల లలిత, కీలకంగా ఉన్నారు. వ్యక్తులతో పాటు పార్టీ నేతలు సైతం గెలుపు గుర్రాల కోసం వేటలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఎవరికి వారే టికెట్ల రాకపోతే ఇతర పార్టీల నుంచి జండా పట్టి పోటీకి సై అంటున్నారు. గెలుపే పరమావధిగా జంప్ జిలానీలదే హవా కొనసాగుతోంది. అయినప్పటికి చివరకు ఏమి జరుగుతుందో చూద్దాం.