కాలభైరవ స్వామి ఆలయంలో లక్షదీపార్చన

రామారెడ్డి నవంబర్ 10 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి – రామారెడ్డి గ్రామాలలో ప్రత్యక్షంగా వెలసిన దక్షిణ కాశీగా పిలవబడుతున్న
మహా పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని ఏకైక పుణ్యక్షేత్రం శ్రీ కాలభైరవ స్వామి ఆలయం, ఈ యొక్క ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా మూడవ రోజులో భాగంగా సోమవారం లక్ష దీపార్చన కార్యక్రమాన్ని సాయంత్రం బైరి నాగరాణి-విటల్, సాత్విక్, చైతన్య, శ్రీవల్లి, బైరి నీలిమ- మధుసూదన్, ఆర్యన్, ఆకృతి, బూర బాలమల్లు, బూర శ్రీ విష్ణు, వీరితోపాటు ఆలయ కార్యనిర్వాహణ అధికారి దంపతుల సమక్షంలో లక్ష దీపాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి స్వామివారికి పూజా కార్యక్రమాలతో పాటు, ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రమిదలను వివిధ అలంకార రూపంలో ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా లక్షద్వీపాలను వెలిగించి తమ ముక్కులను చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశి కృష్ణ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ లక్ష్మణ్, ఆఫీస్ సబార్డినేటర్ నాగరాజు,భారత్, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
