చేర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఏకైక లక్ష్యంగా 25వ తేదీన జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ పిలుపునిచ్చారు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే జేఏసీ ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని, అందులో భాగంగానే ఈనెల 25వ తేదీన చేర్యాల పట్టణం కేంద్రంతో పాటు మద్దూర్,కొమురవెల్లి, ధూల్మిట్ట అన్ని మండలాల్లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బంధు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.