గ్రామ పంచాయతీ పాలనాధికారులుగా మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన విధి విధానాలు, అర్హతలను ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో విడుదల చేసింది. మాజీ వీఆర్వోలు, వీఆర్ఏలకు గ్రామ పంచాయతీ పాలనాధికారులుగా అవకాశం కల్పించనుంది.
గ్రామ పంచాయతీ పాలనాధికారిగా నియమితులవ్వడానికి, అభ్యర్థులు ఇంటర్ తో పాటు ఐదేళ్ల పాటు వీఆర్వో లేదా వీఆర్ఏగా పని చేసి ఉండాలి. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మిగిలిన పోస్టులకు డిగ్రీ అర్హత ఉన్న వారిని డైరెక్ట్ గా రిక్రూట్ చేయనున్నారు