గ్రామ భవితకై నూతన పునాదులు వేస్తా: పెంటాల లావణ్య

Kamareddy
1 Min Read

– కుంటుబడిపోయిన గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకొస్తా
– ఏ నాయకుడు చేయని మార్పు నేను చేసి చూపిస్తా
– మహిళా సంక్షేమమే నా లక్ష్యం
– మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన
– 24 గంటలు ప్రజాక్షేత్రంలో ప్రజలకై పాటుపడతా

భిక్కనూరు, డిసెంబర్ 9 (ప్రజాజ్యోతి)

భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన పెంటల లావణ్య ఫుట్ బాల్ గుర్తుతో సర్పంచ్ బరిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మహిళా సాధికారతను సాధించే దిశగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది.

ప్రజల మన్ననలు పొందేలా అభివృద్ధి

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులరీత్యా గ్రామంలోని మహిళలంతా బీడీ కార్మికులు కావడంతో సరైన పరిధిలో లేక మహిళలంతా జీవనోపాధి కొరకు హైదరాబాద్ లో పరిశ్రమలలో పనిచేయడానికి వెళ్తున్నారు. అలా కాకుండా మన గ్రామంలోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మహిళా అభివృద్ధితో పాటు జీవనోపాధి కల్పించాలని గొప్ప సంకల్పంతో సర్పంచి బరిలో ఉన్నానని ఆమె తెలిపింది.
– గ్రామంలో రోడ్లు వెడల్పు చేసి వీధిదీపాల పునరుద్ధరణకు కృషి చేస్తానని
– కంచర్ల నుండి చల్మడకు వెళ్లే దారిని పునర్ధకరించి రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చేల చొరవ తీసుకుంటానని
– ప్రభుత్వ పాఠశాలలో విద్యావ్యవస్థను మెరుగు పరుస్తానని
ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామస్తుల ఆశీర్వాదాలతో తనదైన బానిలో ఓటర్లను ఆకట్టుకుంటూ గెలుపు సాధించే దిశగా అడుగులు వేస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *