- అవినీతి రహిత సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలి – రాములు డీజీఎం
వరంగల్ / ప్రజాజ్యోతి:
అవినీతి రహిత సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని పవర్ గ్రిడ్ డీజీఎం రాములు తెలిపారు. బుధవారం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్లో “విజిలెన్స్ అవేర్నెస్ వీక్” కార్యక్రమంలో భాగంగా వాక్‌థాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీజీఎం రాములు మాట్లాడుతూ.. కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం “జాగరూకత: మన అందరి బాధ్యత” అనే నినాదంతో, సమాజంలో నిజాయితీ, పారదర్శకత, బాధ్యత విలువలను ప్రోత్సహించడం కోసం పవర్ గ్రిడ్ సంస్థ పాటుపడుతుందన్నారు. అవినీతి రహిత, బాధ్యతాయుత సమాజ నిర్మాణం కోసం అందరూ తమ అంకితభావాన్ని వ్యక్తం చేశారు. ఈ వాక్‌థాన్‌లో రాములు, డీజీఎం, కె. సూర్యప్రకాశ్, ఇతర పవర్‌గ్రిడ్ సంస్థ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జీవితంలోని అన్ని రంగాల్లో నిజాయితీ మరియు నైతిక ప్రవర్తనను పాటించాలనే ప్రతిజ్ఞతో ముగిసింది.

