చెరువులు కుంటలను పరిశీలించిన తహసిల్దార్
— తాసిల్దార్ ఉమలత
రామారెడ్డి ఆగస్టు 28 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల భారీ వర్షానికి చెరువులు కుంటలు నిండుకుండల ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చెరువులు ప్రమాదం పొంచి ఉన్న సందర్భంగామండల తాసిల్దార్ ఉమలత, రవికాంత్, తదితరులు పర్యవేక్షించి. తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాలు ఎవరైనా ఉన్నట్లయితే వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండలో ఉండకుండా ప్రభుత్వం కల్పించిన వసతి గృహాలలో ఆశ్రయం పొందాలని, అదేవిధంగా వరద వర్దవృద్దికి మండల కేంద్రంలో చాలా రకాల పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
