-గంటల పాటు పడిగాపులు
బిక్కనూరు ఆగస్టు 23 (ప్రజా జ్యోతి)
భిక్కనూరు మండలంలో యూరియ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. గత పది రోజుల నుండి యూరియా కోసం రైతులు పడి గాపులు కాస్తున్నారు. శనివారం పెద్ద మల్లారెడ్డి సొసైటికి యూరియా వచ్చిందని సమాచారం అందుకున్న గ్రామస్తులు ఉదయం ఐదు గంటల నుండే పడి గాపులు కాశారు.బహిర్భూమికి వెళ్లాలంటే కూడా వరుసలో చెప్పులు పెట్టి వెళ్ళామని, పొలం వద్ద అన్ని పనులు మానుకొని యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తే తీరా 250 బస్తాలు మాత్రమే వచ్చాయిని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగినట్లు రైతులు తెలిపారు .ఇట్టి విషయం పై సహకార సంఘం కార్యదర్శి మోహన్ గౌడ్ ను సంప్రదించగా యూరియా వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి దానికి నేనేం చేస్తా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. రైతులకు గత పది సంవత్సరాలుగా లేని యూరియా కొరత ఇప్పుడే చూస్తున్నామని ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వా వైఫల్యానికి కారణమని మండిపడ్డారు.రైతుల పట్ల వివక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల కొరత లేకుండా చూడాలని “ప్రజా జ్యోతి “పత్రిక ద్వారా పెద్ద మల్లారెడ్డి గ్రామ రైతులు తమ బాధను చెప్పుకున్నారు.
