యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు:

Kamareddy
1 Min Read

యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు:

బిక్కనూరు ఆగస్టు 23 (ప్రజా జ్యోతి)

భిక్కనూరు మండలంలోని అన్ని గ్రామాల కన్నా పెద్ద మల్లారెడ్డి గ్రామం అతిపెద్ద గ్రామం అని ,అందులోనూ పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి ,గత పది రోజుల నుండి యూరియా కోసం రైతులు ఎదురుచూపులు చూస్తుండగా, శనివారం ఉదయం ఐదు గంటల నుండి వరుస క్రమంలో నిలబడగా, బహిర్భూమికి వెళ్లాలంటే కూడా వరుసలో చెప్పులు పెట్టి వెళ్ళామని, పొలం వద్ద అన్ని పనులు మానుకొని యూరియా బస్తాల కోసం పడిగాపులు పడితే ,తీరా 250 బస్తాలు మాత్రమే రావడంతో రైతులు నిరాశకు గురయ్యారు.సహకార సంఘం కార్యదర్శి మోహన్ గౌడ్ ని ప్రశ్నించగా వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి దానికి నేనేం చేస్తా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో, రైతులు గత పది సంవత్సరాలుగా లేని యూరియా కొరత ఇప్పుడే చూస్తున్నామని ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వా వైఫల్యానికి కారణమని మండిపడ్డారు.రైతుల పట్ల వివక్ష వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, “ప్రజా జ్యోతి “పత్రిక ద్వారా పెద్ద మల్లారెడ్డి గ్రామ రైతులు తమ బాధను చెప్పుకున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *