సిద్దిపేట ప్రజాజ్యోతి :తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల పండుగను పురస్కరించుకుని మెరీడియన్ పాఠశాలలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పాఠశాల ఆవరణను పండుగలా అలంకరించారు.విద్యార్థులు కర్రసాములు, బోనాలు, డప్పులు,పోతరాజుల ఆటలు, శివాసత్తుల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. బాలికలు బోనాలు ఎత్తడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్లు దేవేందర్ రెడ్డి రాజా వెంకటరెడ్డి ప్రిన్సిపల్ రాజేందర్రెడ్డి సౌజన్యలు మాట్లాడుతూ”ఇలాంటి ఉత్సవాల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. ఇది వారిలో భౌతిక విద్యతో పాటు సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడుతుంది.”విద్యార్థుల ప్రదర్శనలు – నృత్యాలు, పాటలు, మరియు జానపద కళల రూపకాలు – కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల ఉత్పత్తి, అంతర్భాగాలు, మహిళల పాత్ర వంటి అంశాలను విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. చివరగా, ఉపాధ్యాయ బృందానికి, కార్యక్రమంలో భాగమైన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు మరియు యాజమాన్యం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు