ప్రజా జ్యోతి జుక్కల్ ప్రతినిది జులై 19
అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు, బాలింతలకు, గర్విణులకు పోషకాలతో కూడిన పోషికాహారని అందిస్తూ అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.బిచ్కుంద మండలం ఎల్లారం తాండలో నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్‌వాడీల సేవలను ఆయన అభినందించారు.అంగన్వాడీల బలోపేతం,ఆధునీకరణ దిశగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు అధికారులు పాల్గొన్నారు.