యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో నడవాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:44
Youth should follow the footsteps of Bhagat Singh
  • ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగంలోకేష్
  • గార్ల లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో నడిచి చిన్నప్పటినుండి చెడు పై పోరాటం చేయాలనిఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ అన్నారు. గార్ల మండలం లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ 115 వ జయంతిని  ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగంలోకేష్ పాల్గొని నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు  షాహిద్ భగత్ సింగ్ విద్యార్థి దశలోనే దేశం కోసం స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించి పోరాటాలు చేసి అమరుడైన వ్యక్తి భగత్ సింగ్ అని తెలుపుతూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) భగత్  సింగ్ ను ఆదర్శంగా తీసుకొని విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని విద్యార్థులు భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకోని రాజీలేని పోరాటాలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అదేవిధంగా  భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని దీనికోసం భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడు కి భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగు వెంకటేష్ మండల అధ్యక్షుడు తోకల ఉదయ్ వీరభద్ర చారి వినోద్ కుమార్ శరత్ తదితరులు పాల్గొన్నారు.