భగత్ సింగ్ ఆశయ సాధనలో యువత ముందుండాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:56
 Youth should be at the forefront in achieving Bhagat Singh's ambition

తొర్రూరు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి) .//... భరతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్115వ జయంతి సందర్భంగా ఈరోజు తొర్రూర్ లో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరతమాత గర్వించదగ్గ గొప్ప ధేశ భక్తుడు భగత్ సింగ్ అని కొనియాడారు.నూనుగు మీసాల వయస్సులో నే ధేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడు అని తెలిపారు.భరతమాత ధాస్యశ్రృంఖలాలు  త్రెంచడం కోసం అతి చిన్న వయసులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించి యువతలో దేశభక్తి స్పూర్తి ని రగిలించి యావత్ దేశంలోని యువతకు ఆదర్శప్రాయుడుగా మారి ఉరికొయ్యను చిరునవ్వుతో ముద్దాడి ధేశం కోసం ప్రాణాలర్పించిన యువ యోధుడు అని తెలిపారు.భగత్ సింగ్ గారి ఆశయ సాధనలో భాగంగా నేటి యువత లో దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టి వారి జీవిత చరిత్రను  ను పోరాట స్ఫూర్తిని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా క్రృషి చేస్తున్నారు అని తెలిపారు.

భగత్ సింగ్ ఆశయ సాధనలో యువత ముందుండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పరుపాటి రాం మోహన్ రెడ్డి, ఎస్సీ మోర్చ మహా బాద్ పార్లమెంట్ ఇంఛార్జి అలిసేరి రవిబాబు, జిల్లా నాయకులు అన్నం మధుసూదన్ రెడ్డి, బీజేపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి పైండ్ల రాజేష్, ఎస్సీ మోర్చ అర్బన్ అధ్యక్షుడు మంగళపళ్ళి యాకయ్య,బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్, అర్బన్ కార్యదర్శి జలగం రవి,మండల నాయకులు గంధం రాజు,శివసాయి తదితరులు పాల్గొన్నారు.