కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలి:రంగనాథ్

Submitted by bathula radhakrishna on Sun, 30/10/2022 - 15:01
Yellandu

జేకే ఓసి పొడగింపు ప్రాజెక్ట్ ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ నేడు ఇల్లందులో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జేకే ఓసి పొడగింపు ప్రాజెక్ట్ ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని కోరారు.గత సంవత్సరం ఇల్లందు జేకే ఓసి కోల్ తో పాటు ఓబీని సింగరేణి కార్మికులు తీయడం ద్వారా సుమారుగా రూ.400 కోట్ల లాభాలు గడించడం జరిగిందని గుర్తు చేశారు.కార్మికులకు అవకాశం ఇస్తే తప్పకుండా జేకే ఓసి పొడగింపు ప్రాజెక్ట్ కూడా లాభాలలో నడిపిస్తారని తెలిపారు. బొగ్గుకు  పుట్టినిల్లయిన ఇల్లందు ఏరియా ఇప్పటికే అతి తక్కువ కార్మికులతో నడుస్తుందని, కేంద్ర ప్రభుత్వ బోగ్గుబావుల వేలంపాటల నిర్ణయం వలన కొత్త ప్రాజక్ట్స్ రావడం కష్టమేనన్నారు.ప్రస్తుత సమయంలో ఉన్న వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.జేకే ఓసి ప్రస్తుతం నడుస్తున్న పద్దతిలోనే నూతన ప్రాజెక్ట్ ను సైతం అలానే కొనసాగించాలని కోరారు.కొత్త ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా ఇక్కడి కార్మికులకు ఇబ్బంది కలుగకుండా వెంటనే ప్రారంభించాలని కోరారు.

Tags