ప్రపంచ బధిరుల దినోత్సవం క్షయ వ్యాధి నివారణ-నిర్మూలన లపై న్యాయ సేవ సదన్ లో అవగాహన

Submitted by Sathish Kammampati on Sat, 01/10/2022 - 10:23
World Day of the Deaf awareness in Nyaya Seva Sadan on prevention and eradication of Tuberculosis


నల్లగొండ సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి)....రాస్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు నెలవారీ కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ,నల్లగొండ సంయుక్త ఆద్వర్యం లో30 న “ప్రపంచ బధిరుల దినోత్సవం” మరియు క్షయ వ్యాధి నివారణ-నిర్మూలన లపై  న్యాయ సేవ సదన్ లో  అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో బధిరులను లేతవయసులోనే గుర్తిచడం వారికి తగిన చికిత్సవిదానలను  గురించి జిల్లా వైద్య కేంద్రం డా వధువన్ సింహాద్రి వివరించారు అలాగే  క్ష్యయ వ్యాధి వ్యాప్తి నివారణ, క్ష్యయ వ్యాధిగ్రస్తుల సంక్షేమం మొదలగు వాటిపై జిల్లా క్ష్యయ వ్యాది నివారణ కేంద్రం అధికారి డా. కల్యాణ్ చక్రవర్తి విపులంగా వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పారలీగల్ వాలంటరీలను ఉద్దేశించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. దీప్తి, మాట్లాడుతూ జిల్లాలో గల మారుమూల గ్రామాలలో పై విషయాల గురించి ప్రజలకు తెలియజేసి వారిని వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సుభద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నామినేటెడ్ మెంబర్లు లెనిన్ బాబు, శంకరయ్య మీడియేటర్ భీమార్జున రెడ్డి ఇతర న్యాయవాదులు పాల్గొని విజయవంతం చేసారు.