తొర్రూరు పట్టణ అభివృద్ధికి కృషి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 15:52
Working towards the development of Thorrur town
  •  మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య
  • కమిషనర్ గుండె బాబు

oసెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి) .../పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ గుండె బాబు అన్నారు. బుధవారం చెరువు కట్ట రోడ్డుకు మండల పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోనుగోటి సోమేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి   తో కలిసి చెరువు కట్ట రోడ్డుకు పోల్సును పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో పదో వార్డు. 11వ వార్డు 16వ వార్డు యందు 9 స్ట్రీట్ లైట్ పోల్స్ శాంక్షన్ అయ్యాయని రూపాయలు మూడు లక్షల 55వేలతో పోల్స్ వేస్తున్నామన్నారు.  చెరువు కట్ట రోడ్డుకు 44లక్షల నిధులతో సిసి రోడ్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.  ఈ సందర్భంగా చైర్మన్  కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సహాయ సహకారాలతో తొర్రూర్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తొర్రూర్ మున్సిపాలిటీ రానున్న రోజుల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే అన్ని వార్డులలో పనులు ప్రారంభమయ్యాయి అన్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  సహకారంతో మోడల్ మార్కెట్ పనులు కూడా పూర్తయ్యాయని త్వరలో ప్రారంభోత్సవం కూడా జరుగుతుందన్నారు. తోరూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కని విని ఎరగని రీతిలో యతి రాజారావు పార్క్ నిర్మాణం కూడా పూర్తి కావచ్చిందని. అన్నారు.

ప్రభుత్వ0 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు.  మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో   మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు. కౌన్సిలర్లు గుగులోతు శంకర్. కొలుపుల శంకర్.నాయకులు. కర్ణ నాగరాజు. దొంగరి శంకర్.  బిజ్జల్ల అనిల్. జై సింగ్ నాయక్. రవి. జంప. నల్లపు రాజు. తదితరులు పాల్గొన్నారు.