డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం..సీతాఫలం:

Submitted by venkat reddy on Wed, 28/09/2022 - 09:08
 A wonderful fruit to check diabetes..Sitaphalam:

*సీతాఫలం పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
నిడమనూరు,సెప్టెంబర్ 27,(ప్రజాజ్యోతి):  
వర్షకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం అయిందంటే చాలు మన అందరికీ టక్కున గుర్తొచ్చే పండు.. సీతాఫలం వీటిని ఇంగ్లీషులో కస్టర్డ్ యాపిల్స్ అని కూడా అంటారు. కేవలం పచ్చనిమేడ.. తెల్లని గదులు.. నల్లని దొరలు.. చెప్పకోండి చూద్దాం..” అంటే పిల్లలు కూడా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఒలుచుకుని తినడం కష్టమైనా ఆ రుచిని ఇష్టపడని వాళ్లు అరుదే. రాళ్లల్లో రప్పల్లో ఎక్కడంటే అక్కడ సులభంగా పెరిగినప్పటికీ సీతాఫలంలో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లూ పీచూ ఖనిజాలూ విటమిన్లు పిండిపదార్థాలు కొద్దిశాతం కొవ్వు అన్ని పోషకాలు దొరుకుతాయి. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం అయిందంటే చాలు మన అందరికీ టక్కున గుర్తొచ్చే పండు.. సీతాఫలం వీటిని ఇంగ్లీషులో కస్టర్డ్ యాపిల్స్ అని కూడా అంటారు. కేవలం శీతాకాలంలో మాత్రమే లభించే ఈ పండ్లును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. సీతాఫలం అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా అందించడంలో కీలక పాత్ర వహిస్తాయి.అలాగే సీతాఫలం మొక్కలోని ఆకులు, బెరడు, వేరు ఇలా ప్రతి భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో సీతాఫలం ఆకులను, బెరడు, వేర్లను ఉపయోగించి డయాబెటిస్, గుండె జబ్బులు చర్మ వ్యాధులు, డయేరియా వంటి వ్యాధులకు అద్భుత పరిష్కారం చూపబడింది.ఔషధ గుణాలు కలిగిన సీతాఫలం మొక్క భాగాలను వివిధ రకాల వ్యాధుల నివారణలో ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాఫలం మొక్క బెరడును నీళ్లలో బాగా మరిగించి మిగిలిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకున్నట్లయితే ప్రమాదకర డయేరియా వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.దీర్ఘకాలంపాటు చక్కెర వ్యాధితో బాధపడేవారు కొన్ని సీతాఫల ఆకులను సేకరించి వాటిని నీళ్లలో మరిగించి వచ్చిన కషాయాన్ని ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజులపాటు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న అధిక మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.సీతాఫలం ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున వీటిని ప్రతిరోజూ కషాయంగా చేసుకుని తాగితే సీజనల్ గా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు మరియు ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై రాసినట్లయితే గాయాలు త్వరగా మానడంతో పాటు చర్మ సమస్యలు తొలగుతాయి.