కార్పొరేట్ పాఠశాలకు దీటుగా పాఠశాలను తీర్చిదిద్దుతాం : సర్పంచ్ శ్రీలత సోమన్న

Submitted by narmeta srinivas on Mon, 21/11/2022 - 19:38
పాఠశాల విద్యార్థులకు షూ, బెల్ట్ లు పంపిణీ చేసిన సర్పంచ్

విధ్యార్థులకు షూ, టై, బెల్టులు పంపిణీ చేసిన సర్పంచ్

పాలకుర్తి /  కొడకండ్ల (ప్రజా జ్యోతి)  నవంబర్ 21 :  కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నర్సింగాపురం పాఠశాలను తీర్చిదిద్దుతామని నర్సింగాపురం గ్రామ సర్పంచ్ దండెంపల్లి శ్రీలత సోమన్న అన్నారు. సోమవారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ దండంపల్లి శ్రీలత సోమన్న తమ సొంత ఖర్చులతో 12,500 రూపాయల విలువగల షూ, బెల్ట్, టై లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సర్పంచ్, పాలకమండలి ఆధ్వర్యంలో పాఠశాల ప్రహరీ గోడ, గేటు నిర్మించి, పాఠశాల ముందు ఉన్న పెద్ద కాలువను పూడ్చి అందులో పూల మొక్కలు నాటి ఉద్యానవనంగా తీర్చిదిద్దామని తెలిపారు. పాఠశాలకు ఓవర్ హెడ్ ట్యాంకు, గేటు, పాఠశాల పేరుతో కూడిన ఆర్చి నిర్మాణం చేసి, పాఠశాల ప్రాంగణంలో మట్టి పోయించి పూల మొక్కలు నాటించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగాల సోమయ్య 4000 రూపాయల విలువగల టై, బెల్ట్ లను విద్యార్థులకు డొనేట్ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న ఒకటవ వార్డు మెంబర్ వీరన్న విద్యార్థులకు వాటర్ బాటిల్స్ త్వరలో డొనేట్ చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలకు విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కప్పల శ్రీనివాస్, ఎస్ఎంసి చైర్మన్ అంబటి రజిత, వార్డ్ మెంబర్ వీరన్న, పాఠశాల ఉపాధ్యాయులు ఈర అనిల్, గంగాధర కృష్ణ, కీలు కానీ ఉషశ్రీ, చింతల కనకరాజు, అంగన్వాడీ టీచర్లు దండంపల్లి పద్మ, వలబోజు నిర్మల తదితరులు పాల్గొన్నారు.