భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి అవమానాలు ఎందుకు..!

Submitted by kosgi narsimulu on Wed, 28/09/2022 - 10:56
 Why the insults to the statue of the founder of the Constitution of India..!

- అవగాహన లోపంతోనే ఇలా జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన టిడిపి నాయకుడు శ్రీనివాస్

తాండూరు సెప్టెంబర్ 27 ప్రజా జ్యోతి :-  వికారాబాద్ జిల్లా  పెద్దేముల్ మండలం  ఆత్కుర్ గ్రామాన్ని  యూత్ ప్రభంజనం జై భీమ్ యూత్ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడుఎం శ్రీనివాస్ సందర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఆత్కురు గ్రామములో  గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని  ముళ్ళ చెట్లు పిచ్చి మొక్కల మద్యన అవమానకరంగా వదిలేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం  గ్రామ యువకులతో కలిసి పరిశీలించిన  ఎం శ్రీనివాస్ గ్రామములో నెలకొన్న  సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  మీ అందరి సహకారంతోనే విగ్రహాన్ని ప్రతిష్టించే విధంగా  చూడాలని యువకులు అబిప్రాయ పడుతున్నారు.
అదేవిధంగా పెద్దేముల్‌  పోలీసులు సైతం విగ్రహము ఉన్న స్థలాన్ని పరిశీలించారని చెప్పారు. విగ్రహ ప్రతిష్టపాన కార్యక్రమాన్ని  గ్రామస్తులందరి సహకారంతో కలిసి ప్రశాంతమైన  వాతావరణంలో ప్రేమ పూర్వకంగా విగ్రహ ప్రతిష్టాపన జరుపుకుందామని సూచించారు. సబండ వర్గాలకు సమ న్యాయం  జరిగే విధంగా ప్రపంచ దేశాలనే అబుపరిచే విధంగా లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యాలాల   మాజీ సర్పంచ్ అంజిలయ్య, గ్రామ యువకులు కృష్ణ, చందు, రాజు, నరేష్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.