పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

Submitted by sai teja on Thu, 15/09/2022 - 10:25
The welfare of poor people is the duty of the government

 
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
  
 అర్హులందరికీ ప్రభుత్వ ఆసరా

 -ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

అనంతగిరి, సెప్టెంబర్14, ప్రజా జ్యోతి: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.మండల పరిధిలోని కొత్తగూడెం, గొండ్రియాల, లకారం గ్రామాలలో బుధవారం నిర్వహించిన ఆసరా పింఛన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసి  లబ్ధిదారులకు మంజూరైన నూతన ఆసరా పెన్షన్ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు నెలవారీగా ప్రభుత్వం ఫించన్లు అందిస్తుందని, ఒంటరి మహిళలకు సైతం ఫించన్లు ఇస్తున్న ఘనత తమ టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నూతన ఆసరా కార్డుల ప్రత్యేకతను ఆయన వివరించారు. గత ప్రభుత్వాలు పేదలను  పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.  రెక్కలు ముక్కలు చేసుకుని కాయ కష్టం చేసుకునే పేదలకు ఎంతో కొంత అవసరం అందించాలని లక్ష్యంతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.  అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని.అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు తెలిపారు.పేదవారికి ఎలాంటి కష్టం రాకూడదు అని వారి వైద్య సేవలకు అయిన ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరు చేసిన రాష్ట్ర సీఎం కు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్న  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, టిఆర్ఎస్ పార్టీకి  మీ నిండు ఆశీర్వాదం ఉండాలని  ఆయన కోరారు.

అనంతరం ఆయా గ్రామాలలో ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే  నిధులనుండి మంజూరైన సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ గౌడ్, సర్పంచుల పోరం అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ నాయకులు  మాగి యాకోబు,ఈదుల కృష్ణయ్య, బుర్ర నరసింహారెడ్డి, మటపల్లి శ్రీనివాస్ గౌడ్, మట్టపల్లి పుల్లయ్య గౌడ్, కంటు నాగర్జున, లకారం వెంకటరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నెల్లూరు లీలవతి బాబురావు, శేషమ్మ, భూపతి, ఎంపీటీసీ కృష్ణవేణి హరీష్, పిఎసిఎస్ చైర్మన్ ఉషారాణి, నాయకులు వాడ కొప్పుల సైదులు, పూర్ణయ్య, కొండలరావు, రాము నాయక్, రాము, గంగురు శ్రీనివాస్, సంతోష్, గ్రామ శాఖ  అధ్యక్షుడు మురళి, గంగూరు బాబురావు, వెంకయ్య, లచ్చిరెడ్డి, రాజమోహన్ రెడ్డి, కబీర్, తదితరులు పాల్గొన్నారు.