అర్హులైన ప్రతి వ్యక్తికి ఆసరా పింఛన్ అందిస్తాం

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 11:37
We will provide support pension to every eligible person

ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ  ఎం సి కోటిరెడ్డి

(త్రిపురారం) సెప్టెంబర్ 7 (మన తెలంగాణ) సాగర్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి వ్యక్తికి తప్పకుండా ఆసరా పింఛన్ అందిస్తామని ఎమ్మెల్యే నోముల భగత్ , ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి అన్నారు. బుధవారం మండల పార్టీ ఆధ్వర్యంలో అనుముల సుశీల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ మంజూరు పత్రం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అర్హులై ఉండి ఆసరా పింఛన్ రానట్లయితే ఎవరు అధైర్య పడోద్దని----మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే రైతులకు మరియు పేద ప్రజలకు మేలు జరిగిందని  తెలిపారు. కరోణ కారణంచేతనే నాలుగు సంవత్సరాల నుంచి నూతన పింఛన్లు దరఖాస్తు చేసుకున్న వారికి అందియలేకపోయామని వారు తెలియజేశారు . ఏది ఏమైనా భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచని వారు తెలిపారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథ కం పేదలకు, రైతులకు వర్తింపజేస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా వారు పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనుమల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్, జిల్లా నాయకులు కామర్ల జానయ్య, మర్ల చంద్రారెడ్డి, దన్సింగ్ నాయక్, పెద్దవైన శ్రీనివాస్ యాదవ్ , మండల పరిషత్ అధికారి అలివేలుమంగ,మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ , బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, నాయకులు భరత్ రెడ్డి, రామచంద్రయ్య, అనంతరెడ్డి, మహిళ అధ్యక్షురాలు మాద దనలక్ష్మి వెంకటేశ్వర్లు, మైనార్టీ అధ్యక్షుడు షేక్ దస్తగిరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అవి రేండ్ల సైదులు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చందు నాయక్, కొల్లి రాము, తిక్కన పోయిన నాగరాజు,ధర్మారెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారుఆపేందుకు బిజెపి కుట్ర చేస్తుందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి లో అన్నారు