ప్రజల సమస్యలను తీర్చేందుకు తెలంగాణాను తెచ్చుకున్నాం

Submitted by Kramakanthreddy on Sat, 10/09/2022 - 16:10
We brought Telangana to solve people's problems
  • కరివేన రిజర్వాయర్ పూర్తయ్యే దశలో ఉంది.వచ్చే సంవత్సరం నీళ్లొస్తాయి"
  • ప్రజల సమస్యలన్నీ దశల వారిగా తీరుస్తాం"
  • రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్

  మహబూబ్నగర్, సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి ప్రతినిధి) :  పేదల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం ఆయన మహబూబ్ నగర్ గ్రామీణ మండలం ధర్మాపూర్ గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సి సి రోడ్లను ప్రారంభించారు.61మంది నూతన ఆసరా పెన్షన్ కార్డుల లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు.

ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణానికి అతి చేరువలో ఉన్న ధర్మాపూర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని,తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామంలో పెన్షన్ల కింద  నెలకు 64,500 రూపాయలు ఇస్తుండగా ఇప్పుడు 4 లక్షల 86 వేల రూపాయలు నెలకు ఇస్తున్నామని, గ్రామంలో కేవలం పెన్షన్ల కింద ఇప్పటివరకు ఐదుకోట్ల 58 లక్షల రూపాయలు పంపిణీ చేశామని ,కల్యాణ లక్ష్మి కింద 53 మందికి లక్ష 116 రూపాయల చొప్పున ఇచ్చామని మంత్రివర్యులు అన్నారు. అదేవిధంగా షాది ముబారక్ కింద ఇద్దరికి ఆర్థిక సహాయం అందించామని, రైతు బంధు పథకం కింద 610 మంది రైతులకు 3 కోట్ల 48 లక్షలు వారి అకౌంట్లో జమ చేశామని,రైతు బీమా కింద చనిపోయిన 10 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని, సీఎం ఆర్ ఎఫ్ కింద 26 మంది లబ్ధిదారులకు 12 లక్షల 4500 ఆర్థిక సాయం అందించామని, గ్రామంలో అతి పెద్ద సమస్య అయిన తాగు నీటి సమస్యను తీర్చి మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నదినీటిని అందిస్తున్నామని, గ్రామంలోని పాఠశాల భవనం నిర్మాణానికి కోటి రూపాయలు, ముదిరాజ్ భవన్ కు 10 లక్షలు ,బుడగ జంగాల కమ్యూనిటీ హాల్ కు 5 లక్షలు, గౌడ సంఘం భవనానికి 5 లక్షలు ఇచ్చాం అనిఎవరైనా అనారోగ్యం పాలైన వారిని అర్ధరాత్రి అయినా సరే ఆదుకుంటున్నాం అని అన్నారు.

రెవిన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, ఆర్డిఓ అనిల్ కుమార్, ఎంపీపీ సుధా శ్రీ ,జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి రవీందర్ రెడ్డి , తహసిల్ధార్ పాండు నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.